Ugadi: తెలుగు రుతువులు, మాసాలు, తిథులు ఎలా లెక్కిస్తారు?

తెలుగు వారికి అసలైన కొత్త సంవత్సరం ఉగాది. ఉగాది నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. అందుకే ఇది ‘యుగ ఆది’ అయింది. అదే ఉగాది (Ugadi) అయింది.

తెలుగు వారు కాలాన్ని లెక్కించే పద్ధతి, తెలుగు వారి కేలండర్ భిన్నమైనది. పురాతన హిందూ కేలండర్‌నే తెలుగు వారు కూడా కొన్ని మార్పులతో అనుసరిస్తున్నారు.

Ugadi ఒక సంవత్సరాన్ని రెండు ఆయనాలు గాను, ఆరు రుతువులు గాను, 12 మాసాలు (నెలలు) గాను విభజించారు. అంటే.. ఒక్కో రుతువుకు రెండు మాసాలు ఉంటాయి. అలాగే.. ఒక్కో మాసాన్ని రెండు పక్షాలుగా కూడా విభజించారు.

ఒక పక్షానికి రెండు వారాలు, ఒక వారానికి ఏడు రోజులు, ఒక రోజుకు ఎనిమిది ఝాములు, ఒక ఝాముకు మూడు గంటలు, ఒక గంటకు అరవై నిమిషాలు ఉంటాయి.

ఇలా ప్రతి నిమిషానికి వచ్చే నక్షత్రంతో సహా తెలుగు కేలండర్‌ నిర్దిష్టంగా ఉంటుంది. ఈ వివరాలన్నీ సమగ్రంగా ఉన్నదానినే పంచాంగం అంటారు.

చంద్రుడి సంచారంతో ఎక్కువగా అనుసంధానమైనదానిని ‘చాంద్రమాన పంచాంగం’ అని, సూర్యుడి సంచారంతో ఎక్కువగా అనుసంధానమైనదానిని ‘సూర్యమాన’ పంచాంగం అని వ్యవహరిస్తారు.

Ugadi రెండు ఆయనాలు: 

  1. ఉత్తరాయణం: సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించే వరకూ ఉన్న ఆరు నెలల కాలం. ఆ ఆరు నెలలు.. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంత భాగం, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉంటుంది.
  2. దక్షిణాయణం: సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలో ప్రవేశించే వరకూ ఉన్న ఆరు నెలలు. అవి.. ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగం

ఆరు రుతువులు:

  1. వసంత రుతువు (Spring): చెట్లు చిగురించే కాలం (చైత్ర మాసం, వైశాఖ మాసం)
  2. గ్రీష్మ రుతువు (Summer): ఎండా కాలం (జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం)
  3. వర్ష రుతువు (Monsoon): వర్షా కాలం (శ్రావణ మాసం, భాద్రపద మాసం)
  4. శరదృతువు (Autumn): మంచి వెన్నెల కాలం (ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం)
  5. హేమంత రుతువు (Winter): చలి కాలం (మార్గశిర మాసం, పుష్య మాసం)
  6. శిశిర రుతువు: (Fall) ఆకురాలే కాలం (మాఘ మాసం, ఫాల్గుణ మాసం)

పన్నెండు మాసాలు:

  1. చైత్రం (మార్చి – ఏప్రిల్)
  2. వైశాఖం (ఏప్రిల్ – మే)
  3. జ్యేష్టం (మే – జూన్)
  4. ఆషాఢం (జూన్ – జూలై)
  5. శ్రావణం (జూలై – ఆగస్ట్)
  6. భాద్రపదం (ఆగస్ట్ – సెప్టెంబర్)
  7. ఆశ్వయుజం (సెప్టెంబర్ – అక్టోబర్)
  8. కార్తీకం (అక్టోబర్ – నవంబర్)
  9. మార్గశిరం (నవంబర్ – డిసెంబర్)
  10. పుష్యం (డిసెంబర్ – జనవరి)
  11. మాఘం (జనవరి – ఫిబ్రవరి)
  12. ఫాల్గుణం (ఫిబ్రవరి – మార్చి)

Ugadi తెలుగు కేలండర్‌లో అమావాస్య నుండి అమావాస్య వరకు ఒక నెలగా లెక్కిస్తారు. ప్రతి అమావాస్యకి ఒక నెల మారుతుంది. ఈ నెలను రెండు పక్షాలుగా విభజించారు.

మాసానికి రెండు పక్షాలు

  1. శుక్ల పక్షం: ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం. శుక్లం అంటే తెలుపు అని అర్థం. దీనిని శుద్ధ పక్షం అని కూడా అంటారు. ఈ పక్షంలో చంద్రుడు ప్రతి రోజూ పెరుగుతూ వస్తాడు. పౌర్ణమి నాటికి నిండు చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడితో పాటు వెన్నెల కూడా పెరుగుతూ రాత్రుళ్ళు అంతకంతకూ కాంతివంతంగా అవుతాయి.
  2. కృష్ణ పక్షం: ప్రతి నెల పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు కృష్ణ పక్షం. కృష్ణ అంటే నలుపు అని అర్థం. దీనిని బహుళ పక్షం అని కూడా అంటారు. పౌర్ణమి తర్వాత చంద్రుడు ప్రతి రోజూ తగ్గుతూ పోతాడు. అమావాస్య నాటికి కనిపించడు. చంద్రుడితో పాటు వెన్నెల కూడా తగ్గిపోయి రాత్రుళ్ళు మరింత చీకటిగా మారుతాయి.

పక్షంలో 15 రోజులు

తెలుగు మాసంలోని రెండు పక్షాల్లో ఒక్కో పక్షంలో 15 రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో 14 రోజులను తిథులుగాను మిగతా ఒక్క రోజును పౌర్ణమి లేదా అమావాస్యగా వ్యవహరిస్తారు. అవి:

  1. పాడ్యమి
  2. విదియ
  3. తదియ
  4. చవితి
  5. పంచమి
  6. షష్టి
  7. సప్తమి
  8. అష్టమి
  9. నవమి
  10. దశమి
  11. ఏకాదశి
  12. ద్వాదశి
  13. త్రయోదశి
  14. చతుర్దశి
  15. పౌర్ణమి / అమావాస్య

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe