Oscar Awards 2024: ఓపెన్‌హేమర్ కి బెస్ట్ పిక్చర్ సహా 7 ఆస్కార్లు

క్రిస్టొఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓపెన్‌హేమర్ (Oppenheimer) సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా 7 అవార్డులు గెలుచుకుంది.

హాలీవుడ్‌లో అతి పెద్ద సినిమా ఉత్సవమైన 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం ఈ రోజు సోమవారం నాడు ఏంజెలెస్‌లో వైభవంగా జరిగింది.

Oscar Awards 2024 winner Cillian Murphy

అమెరికా అణుబాంబు తయారీలో కీలకంగా నిలిచిన జర్మన్ శాస్త్రవేత్త ఓపెన్‌హేమర్ పాత్ర పోషించిన సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డు గెలుపొందారు.

Oscar Awards 2024లో Oppenheimer సినిమా దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్‌ను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరించింది.

అలాగే ఈ సినిమాలో ఆటమిక్ ఎనర్జీ కమిషన్ అధ్యక్షుడు లూయిస్ ట్రాస్ పాత్రలో నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు గెలుచుకున్నారు.

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లోనూ ఓపెన్‌హేమర్ విజేతగా నిలిచింది.

దీనికి ముందు Oppenheimer మూవీ బాఫ్టా, క్రిటిక్స్ చాయిస్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ ఉత్తమ చిత్రంగా అవార్డులు గెలుచుకుంది.

ఇక ఉత్తమ నటి అవార్డును పూర్ థింగ్స్ సినిమాలో నటించిన ఎమ్మా స్టోన్‌ను వరించింది. ఆమెకు ఇది రెండో Oscar Award.

ఇంతకుముందు లా లా లాండ్ సినిమాలో నటనకు గాను ఎమ్మా స్టోన్‌ ఆస్కార్ గెలుచుకుంది.

హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన కమెడియన్ జిమ్మా కెమ్మెల్ 96వ అకాడమీ అవార్డులకు హోస్ట్‌గా వ్యవహరించారు.

Oscar Awards 2024 విజేతల లిస్ట్ ఇదీ

ఉత్తమ చిత్రం: ఓపెన్‌హేమర్

ఉత్తమ దర్శకుడు: క్రిస్టొఫర్ నోలన్ (ఓపెన్‌హేమర్)

ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హేమర్)

ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హేమర్)

ఉత్తమ సహాయ నటి: డావైన్ జాయ్ రాండాల్ఫ్ (ద హోల్డోవర్స్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: అమెరికన్ ఫిక్షన్

ఉత్తమ యానిమేషన్ చిత్రం: ద బాయ్ అండ్ ద హెరాన్

ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: వార్ ఈజ్ ఓవర్ – ఇన్‌స్పైర్డ్ బై ద మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యోకో

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్

ఉత్తమ మేకప్, కేశాలంకరణ: పూర్ థింగ్స్

ఉత్తమ నేపథ్య సంగీతం: ఓపెన్‌హేమర్

ఉత్తమ ధ్వని: ద జోన్ ఆఫ్ ఇంటరెస్ట్

ఉత్తమ ఛాయాగ్రహణం: ఓపెన్‌హేమర్

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: 20 డేస్ ఇన్ మరియుపోల్

ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రం: ద లాస్ట్ రిపేర్ షాప్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హేమర్

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: ద జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ (యునైటెడ్ కింగ్‌డమ్)

ఉత్తమ పాట: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిలా మైనస్ వన్

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe