Telangana BJP Candidate List: మొదటి జాబితాలో 9 మందికి చోటు

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ శనివారం విడుదల చేసింది.

మొదటి జాబితాలో 195 మంది పేర్లు ఉన్నాయి. వారణాసి (Varanasi) నుంచి ప్రధాని మోదీ, గుజరాత్‌లోని గాంధీనగర్‌ (Gandhi nagar) నుంచి అమిత్‌షా పోటీ చేయనున్నారు.

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో Telangana BJP Candidate List తొలి జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావడే విడుదల చేశారు.

కేంద్ర మంత్రివర్గంలోని 34 మంది పేర్లు ఈ తొలి జాబితాలో ఉన్నాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 16 రాష్ట్రాలు (States), రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు (Union territories) చెందిన వారికి ఈ జాబితాలో చోటు దక్కింది.

ఉత్తర ప్రదేశ్‌-51, గుజరాత్ నుంచి 15 స్థానాలు, రాజస్థాన్-15, మధ్యప్రదేశ్ నుంచి 24, పశ్చిమబెంగాల్ 20, కేరళ-12, ఛత్తీస్‌గఢ్‌-11, ఝార్ఖండ్‌-11 అస్సాం-11, ఢిల్లీ-5, ఉత్తరాఖండ్-3, అరుణాచల్‌ ప్రదేశ్‌-2, జమ్మూ-కాశ్మీర్‌-2, అండమాన్ 1, గోవా-1, దామన్‌, త్రిపుర నుంచి ఒక్కో అభ్యర్థిని ప్రకటించారు.

ఈ జాబితాలోని మొత్తం 195 మందిలో 47 మంది యువకులు, 28 మంది మహిళలు (Women), ఎస్సీలకు (SC) 27, గిరిజనలు (ST) 18 మంది, 57 మంది ఓబీసీలకు (OBC) చోటు కల్పించారు.

Telangana BJP Candidate List లో 9 మందికి చోటు

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ (Loksabha) స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు.

సిట్టింగ్‌ ఎంపీల్లో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు మినహా మిగతా సిట్టింగ్‌లకు మరోసారి పార్టీ అవకాశం కల్పించింది. ఆ స్థానంలో అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు అదే నియోజకవర్గం నుంచి టికెట్‌ ఖరారైంది.

అభ్యర్థులు వీరే…

  • సికింద్రాబాద్‌- కిషన్‌రెడ్డి(కేంద్రమంత్రి)
  • హైదరాబాద్‌- డాక్టర్‌ మాధవీలత
  • కరీంనగర్‌- బండి సంజయ్‌కుమార్‌
  • నిజామాబాద్‌- ధర్మపురి అరవింద్‌
  • జహీరాబాద్‌- బీబీపాటిల్‌
  • చేవెళ్ల- కొండా విశ్వేశ్వరరెడ్డి
  • మల్కాజ్‌గిరి- ఈటల రాజేందర్‌
  • భువనగిరి- డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌
  • నాగర్‌కర్నూలు- పి.భరత్‌

ఈటలకే మల్కాజిగిరి

టిక్కెట్‌ కోసం తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ఒకటి. మాజీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, శ్రీశైలం గౌడ్‌, జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి, విద్యావేత్త మల్క కొమురయ్య, కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడు రామకృష్ణ తదితరులు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

నియోజకవర్గం మొత్తం హోర్డింగ్‌లు, పోస్టర్‌లు, వాల్‌రైటింగ్‌లతో ఎవరికి వారు జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈటల రాజేందర్, మురళీధర్‌రావులకు జాతీయ నాయకులతో ఉన్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేశారు. కొమురయ్యకు ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉండడంతో ఆయన ఆ వైపు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది.

ఓ దశలో ‘స్థానికత’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. స్థానికులకే అవకాశం కల్పించాలని కొంతమంది నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్‌ కూడా టికెట్‌ ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌ నుంచి ఆయన పోటీచేశారు. లక్షకు పైగా ఓట్లు సాధించారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.

తనకు అవకాశం ఇవ్వాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. సీటు దక్కకపోతే ఏం చేయాలనే అంశంపై ఇప్పటికే ఆయన అనుచరులతో సమాలోచనలు కూడా జరిపినట్టు వార్తలు వచ్చాయి.

చివరకు పార్టీ అధిష్టానం ఈటల రాజేందర్‌వైపు మొగ్గు చూపింది. తీవ్ర పోటీ మధ్య ఆయనే టికెట్‌ దక్కించుకున్నారు.

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో మేడ్చల్, కంటోన్మెంట్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

మొదటి జాబితాలో చోటు దక్కించుకోని బాపూరావు

ఆదిలాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న సోయం బాపూరావుకు మొదటి జాబితాలో టికెట్‌ దక్కలేదు. మిగిలిన సిట్టింగ్‌లందరికీ మరోసారి అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానం సోయంకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.

గతంలో టీడీపీ తరపున ఎంపీగా పనిచేసిన రమేష్‌ రాథోడ్‌ కూడా ఈ టికెట్‌ ఆశిస్తున్నారు. బైంసా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జాదవ్‌ రాజేశ్‌బాబు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.

సోయం, రమేష్‌ రాథోడ్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో ఎంపీ సోయంకు సఖ్యత లేదని, కావున కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నట్టు తెలిసింది.

ఈ నెల 4న ప్రధాని ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరికి టికెట్‌ ప్రకటిస్తే అసంతృప్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది.

ప్రధాని పర్యటనపై దీని ప్రభావమూ పడొచ్చు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారనే భావన వ్యక్తమవుతోంది.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe