Telugu Calendar: ‘అధిక మాసం’ అంటే ఏమిటి? ఎలా వస్తుంది?

ఇంగ్లిష్ కేలండర్‌లో ఒక్కో నెలకు 30 లేదా 31 రోజులు ఉంటాయి (ఫిబ్రవరి నెల మినహా).

కానీ చంద్రుడి గమనం ప్రకారం లెక్కించే Telugu Calendar తెలుగు నెలలకు అలా ఖచ్చితంగా ఇన్ని రోజులు అని ఉండవు. అందుకే మనకి ‘అధిక మాసం’ అనే మాట వింటుంటాం.

ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అది ఎలాగో చూడండి.

సౌరమాసం – చాంద్రమాసం తేడాలు…

సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి చుట్టి వచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కానీ భూ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే ఆధారం.

భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి చుట్టి వచ్చే కాలాన్ని నెల అంటారు. దానినే చాంద్ర మాసం అంటారు.

అంటే చంద్రుడి హెచ్చుతగ్గుల (చంద్ర కళలు అని కూడా అంటారు) ప్రకారం నెల రోజులను లెక్కిస్తారు.

కానీ ఇలా ఏర్పడే 12 చాంద్రమాసాలు కలిపితే ఒక సంవత్సరం పూర్తి కాదు.

సూర్యుడు – మేషం, వృషభం వంటి 12 నక్షత్ర రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌరమాసం అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అంటారు.

ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కానీ మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తాం.

అయితే, ఒక్కో రాశిలో ఒక నెల పాటు తిరగాల్సిన సూర్యుడు ఒక్కోసారి రెండు నెలల పాటు ఒకే రాశిలో ఉంటాడు.

అలా ఉన్నపుడు మొదటి నెలలో రాశి సంక్రమణం ఉండదు. అలా రాశి సంక్రమణం లేని నెలనే అధిక మాసంగా పరిగణిస్తారు.

Telugu Calendar అధికమాసం ఎప్పుడు వస్తుంది?

సూర్యుడు ఒక సంవత్సరంలో 12 రాశుల చక్రాన్ని పూర్తి చేస్తే, చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అంటే.. 12 x 27 = 324 రోజులు.

సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల, 6 గంటల, 11 నిముషాల 31 సెకన్లు పడుతుంది.

చంద్రుడికైతే 324 రోజులే పడుతుంది. ఈ రెండిటి మధ్య సుమారు 41 రోజుల తేడా ఉంది.

ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుడి చుట్టూ 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు.

దాని వలన 19 సంవత్సరాలకు.. ఏడాదికి 12 మాసాల చొప్పున 228 మాసాలు రావలసి ఉంటే 235 మాత్రమే వస్తున్నాయి.

అంటే చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం.

ఆ లెక్కన ప్రతి 32.5 సౌరమాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించింది భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలేనని చెప్తారు.

ఈ అధిక మాసం ఎప్పుడూ చైత్రమాసం నుండి ఆశ్వయుజమాసం మధ్యలోనే వస్తుంది.

ఒకసారి అధిక మాసం వచ్చాక – తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34 నెలలకు, మళ్లీ 34 నెలలకు, ఆ తర్వాత 35 నెలలకు, అనంతరం 28 నెలలకు వస్తుంది.

అధిక మాసాన్ని.. అధిక మాసం అనే పిలుస్తారు కానీ ప్రత్యేకంగా పేరు ఏమీ ఉండదు. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజ మాసం వస్తుంది.

ఇలాంటి అధిక మాసం శుభకార్యాలకు మంచిదికాదని నిషేధం పాటిస్తుంటారు.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe