AP TET 2024: ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇది

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్‌ టికెట్లు ఫిబ్రవరి 23వ తేదీన విడుదలయ్యాయి.

AP TET నోటిఫికేషన్ విడుదలయ్యాక ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకూ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది.

ఈ ఏడాది ఏపీ టెట్ పరీక్ష కోసం 2.67 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఫిబ్రవరి 19వ తేదీన ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహించారు.

అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 120 పరీక్షా కేంద్రాల్లో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఏపీ టెట్‌ 2024 పరీక్షలు జరుగుతాయి.

అభ్యర్థులు AP TET వెబ్‌సైట్ లో లాగిన్ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు ఎంచుకున్న పరీక్షా కేంద్రాలను మాత్రమే వారికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

AP TET 2024 పరీక్షల టైమ్ టేబుల్ ఇది

PAPER 1A: 27.02.2024 నుంచి 01.03.2024 వరకు

PAPER 2A: 02.03.2024 నుంచి 04.03.2024 వరకు,

అలాగే 06.03.2024 తేదీన

PAPER 1B : 05.03.2024 (FN),

PAPER 2B : 05.03.2024 (AN)

టెట్, డీఎస్‌సీ పరీక్షలపై అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు హెల్ప్ డెస్క్ నంబర్లు 9505619127 , 9705655349, 8121947387, 8125046997 ను ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకూ సంప్రదించవచ్చు.

AP TET ప్రాథమిక కీ ని మార్చి 10వ తేదీన విడుదల చేస్తారు. మార్చి 11వ తేదీ వరకు ఈ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. మార్చి 13న ఏపీ టెట్‌ 2024 తుది కీని విడుదల చేస్తారు.

మార్చి 14వ తేదీన టెట్‌ తుది ఫలితాలు విడుదలవుతాయి.

AP TET, DSC పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహించనున్నారు. డీఎస్‌సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe