Kenneth Mitchell: చికిత్స లేని వ్యాధితో కెనడియన్ నటుడి మృతి

కెనడియన్ నటుడు కెన్నెత్ మిషెల్ ఏఎల్ఎస్ అనే అరుదైన వ్యాధి కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.

Kenneth Mitchell గత ఐదేళ్లుగా అమియోట్రాఫిక్ లేటరల్ సెలెరోసిస్ (ఏఎల్ఎస్) అనే న్యూరలాజికల్ రుగ్మతతో బాధపడుతూ శనివారం మృతి చెందినట్లు ఆయన కుటుంబం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

స్టార్ ట్రెక్: డిస్కవరీ, కెప్టెన్ మార్వెల్ సినిమాల ద్వారా ఆయన హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచుతుడు. కెప్టెన్ మార్వెల్‌ సినిమాలో ఆయన సూపర్ హీరో కారల్ డాన్వర్స్ తండ్రి పాత్ర పోషించారు.

అలాగే, స్టార్ ట్రెక్: డిస్కవరీ సినిమాలో క్లింగాన్స్ కోల్, కోల్ షా, టెనావిక్, అరీలియో పాత్రల్లో నటించారు.

కెన్నెత్ మిషెల్ ఏఎల్ఎస్ రుగ్మతతో తన పోరాటం గురించి 2022 ఆగస్టు 11న సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘‘నాలుగేళ్ల కిందట ఇదే రోజు నాకు #ALS సమస్య ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఈ సమస్య చాలా భయంకరమైనది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ వ్యాధి?

ఏఎల్ఎస్ రుగ్మతను లో గెహ్రిగ్ వ్యాధిగా కూడా పిలుస్తారు. ఈ వ్యాధి వల్ల మెదడు, వెన్నెముకలోని నరాల కణాలు దెబ్బతింటూ పోతాయి.

దీని ఫలితంగా క్రమంగా కండరాలు బలహీన పడటం, పక్షవాతం రావటం, చివరికి శ్వాస వ్యవస్థ వైఫల్యమవటం జరుగుతుంది.

ఈ వ్యాధి ముదిరేకొద్దీ రోగి మాట్లాడటం కానీ, ఆహారం మింగటం కానీ, శ్వాస తీసుకోవటం కానీ కష్టమవుతూ ఉంటుంది.

ఈ వ్యాధి రావటానికి కచ్చితమైన కారణాలు ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే జన్యుపరమైన, పర్యావరణ పరమైన సమస్యలు దీనికి దోహదపడవచ్చునని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఏఎల్ఎస్ జబ్బును నయం చేసే చికిత్స ఏదీ లేదు. ఈ వ్యాధి లక్షణాలకు ఉపశమనం కలిగించటం మీదే చికిత్స చేయగలరు.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe