Telangana DSC: టీచర్‌ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ

ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 11,062 ఖాళీలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది.

5,089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్‌6న గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.

అదనపు పోస్టులతో తాజా నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారులతో కలిసి విడుదల చేశారు.

ఖాళీల వివరాలివే..
మొత్తం 11,062 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220(అప్పర్‌ ప్రైమరీ/సెకండరీ లెవెల్‌), ఎస్జీటీ 796 (ప్రైమరీ లెవెల్‌) ఖాళీలను ప్రకటించారు.

ముఖ్యమైన తేదీలివే
దరఖాస్తులను(Applications) మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు స్వీకరిస్తారు.
ఫీజు(Fees): రూ. 1000. క్రెడిట్‌ కార్డ్‌(Credit Card), డెబిట్‌ కార్డ్‌ (Debit Card) నెట్‌బ్యాంకింగ్‌(Net Banking) ద్వారా విద్యాశాఖ వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in లో ఫీజు చెల్లింపు గేట్‌వే లింక్ ద్వారా చెల్లించొచ్చు.

ఒక్కో పోస్టుకు విడివిడిగా రూ. 1000 చొప్పున ఫీజు చెల్లించాలి. గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు. వాటినే పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖాధికారులు వెల్లడించారు.

తెలంగాణలో మొత్తం 11 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల తేదీలు త్వరలో వెల్లడించనున్నారు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఈ కింద పట్టికలో ఉన్నాయి..

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe