Pankaj Udhas: ప్రసిద్ధ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత

సుప్రసిద్ధ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పంకజ్ ఉదాస్ సోమవారం కన్నుమూశారు.

ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య ఫరీదా ఉదాస్, కుమార్తెలు నయాబ్ ఉదాస్, రీవా ఉదాస్ ఉన్నారు. ఆయన సోదరులు నిర్మల్ ఉదాస్, మనహర్ ఉదాస్ కూడా గాయకులే.

Pankaj Udhas కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయన ముంబై ఆసుపత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు.

మంగళవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

పంకజ్ ఉదాస్ 1951 మే 17న గుజరాత్‌లోని జేత్‌పూర్‌లో జన్మించారు. ఒక టీవీ టాలెంట్ షోలో గాయకుడిగా ప్రారంభించి అనతికాలంలోనే దేశం మెచ్చిన గాయకుడిగా మారారు.

గజల్ గాయకుడిగానూ, హిందీ సినిమాలతో పాటు ఇండీ పాప్‌లో నూ తన పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

నామ్, సాజన్, మొహ్రా తదితర సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంగీత ప్రేమికులను మరచిపోలేరు.

పంకజ్ ఉదాస్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రముఖుల నుంచి సంతాపాలు, నివాళులు వెల్లువెత్తాయి.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe