Sudarshan Setu: ద్వారక వద్ద అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ

భారత దేశంలో అతి పెద్ద కేబుల్ స్టేయ్‌డ్ బ్రిడ్జి ‘సుదర్శన్ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు గుజరాత్‌లో ప్రారంభించారు.

ఓఖా – బెయిట్ ద్వారక దీవిని కలిపే ఈ Sudarshan Setu బ్రిడ్జి నిర్మాణానికి 2017 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

ఇది పాత, కొత్త ద్వారకల మధ్య వారధిగా పనిచేస్తుందని ఆనాడు పేర్కొన్నారు.

గుజరాత్‌లోని ద్వారక నగరంలో ప్రఖ్యాత ద్వారకాదీశ్ ఆలయం ఉంది. శ్రీకృష్ణుడి ఆలయమది.

ప్రధాని మోదీ సుదర్శన్ సేతు బ్రిడ్జిని ప్రారంభించటానికి ముందు Dwarkadhish ఆలయంలో ప్రార్థనలు చేశారు.

Sudarshan Setu ప్రత్యేకతలివీ…

సుదర్శన్ సేతు నిర్మాణానికి 979 కోట్లు వ్యయమైంది.

ఈ తీగల వంతెన పొడవు 2.3 కిలోమీటర్లు. వెడల్పు 27.20 మీటర్లు.

నాలుగు లేన్ల వారధి మీద ఇరు పక్కలా 2.50 మీటర్ల వెడల్పయిన ఫుట్‌పాత్‌లు కూడా ఉన్నాయి.

ఈ ఫుట్‌పాత్ వెంట భగవద్‌గీత లోని శ్లోకాలతో పాటు శ్రీకృష్ణుడి చిత్రాలు ఏర్పాటు చేశారు.   

గుజరాత్‌లోని Dwarka పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓఖా ఓడరేవు.

ఈ ఓడరేవుకు సమీపంలో సముద్రంలో ఉంటుంది బేట్ ద్వారక.

Mangalagiri AIIMS Hospital
మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ ఆస్పత్రి ప్రారంభం

మోదీ ఆ తర్వాత గుజరాత్‌లో మొట్టమొదటి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – AIIMS) ఆస్పత్రిని రాజ్‌కోట్‌లో ప్రారంభిస్తారు.

దానితో పాటు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రులను కూడా మోదీ ప్రారంభిస్తారు.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe